బాట‌సారుల దాహార్తిని తీర్చ‌డం అభినంద‌నీయం

తాండూరు వికారాబాద్

బాట‌సారుల దాహార్తిని తీర్చ‌డం అభినంద‌నీయం
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, డీఎం ప‌విత్ర‌
– జమియతే ఉలేమా ఎ హింద్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వేస‌విలో బాట‌సారుల దాహార్తిని తీర్చేందుకు చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌మ‌ని తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి, తాండూరు ఆర్టీసీ డీపో మేనేజ‌ర్ ప‌విత్ర‌లు పేర్కొన్నారు. శనివారం జమియతే ఉలేమా ఎ హింద్ వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని వినాయక్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చే గారు. పోలీస్టేషన్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి జమియతే ఉలేమా ఎ హింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి హఫీజ్ ఫీర్ ఖాలిక్ అహమద్ సాబీర్‌ల‌తో కలిసి ప్రారంభించారు. తాండూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీపో మేనేజర్ పవిత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి, డీఎం ప‌విత్ర‌లు మాట్లాడుతూ కులమతాల అతీతంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల బాటసారుల దాహార్తి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణు ఎస్ఐ అరవింద్, సంస్థ సభ్యులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.