చెన్నారం మాజీ స‌ర్పంచ్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ

తాండూరు రాజకీయం వికారాబాద్

చెన్నారం మాజీ స‌ర్పంచ్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ
– శివ‌కుమార్‌కు సంతాపం తెలిపిన మ‌హేంద‌ర్ రెడ్డి
యాలాల, ద‌ర్శిని ప్ర‌తినిధి: యాలాల మండ‌లం చెన్నారం మాజీ సర్పంచ్ శివ కుమార్‌ను ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. శివ‌కుమార్ నానమ్మ గారు స్వర్గస్తుల‌య్యారు. శుక్ర‌వారం ఈ విషయం తెలుసుకున్నఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెన్నారం గ్రామానికి చేరుకున్నారు. శివ‌కుమార్లో నివాసానికి వెళ్లి వారి నాన‌మ్మ‌ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ప‌ల‌క‌రించి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి మనో దైర్యం చెప్పారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, దౌలాపూర్ వడ్డే రాములు, పేర్కంపల్లి ఎంపిటిసి యాదప్ప, మాజీ సర్పంచ్ వెంకటయ్య తదితరులు ఉన్నారు.