అక్ర‌మ ఇసుక‌ర‌వాణా చేస్తే కేసులు త‌ప్ప‌వు

క్రైం తాండూరు వికారాబాద్

అక్ర‌మ ఇసుక‌ర‌వాణా చేస్తే కేసులు త‌ప్ప‌వు
– పెద్దేముల్ పోలీస్టేష‌న్‌ను సంద‌ర్శించిన రూర‌ల్ సీఐ రాంబాబు
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: అక్ర‌మ ఇసుక ర‌వాణా చేస్తే కేసులు త‌ప్ప‌వ‌ని తాండూరు రూర‌ల్ సీఐ రాంబాబు హెచ్చ‌రించారు. తాండూరు రూర‌ల్ సీఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మంగ‌ళ‌వారం తాండూరు రూర‌ల్ సీఐ రాంబాబు పెద్దేముల్ పోలీస్టేష‌న్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సీఐ పెద్దేముల్ పోలీస్టేష‌న్ ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. పోలీస్టేష‌న్‌లో పెండింగ్ కేసుల‌పై ఆరా తీశారు. ప‌లు రికార్డుల‌ను కూడ ప‌రిశీలించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులకు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. మండ‌లంలోని రాజ‌కీయాల‌పై ఆరా తీశారు. మండ‌లంలో అక్ర‌మ ర‌వాణాపై ప్ర‌త్యేక దృష్టిసారించాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా అనుమ‌తులు లేకుండా అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేస్తే కేసులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.