నోరు ఉందని వాగొద్దు..!
– అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
– మీ నలుగురికి నేనొక్కడిని చాలు
– టీఆర్ఎస్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త
తాండూరు, దర్శిని ప్రతినిధి: నోరు ఉందికదా అని ఏదంటే అది వాగోద్దని.. మీ బెధిరింపులకు భయపడేది లే.. అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లపై తాండూరు టీఆర్ఎస్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త ధ్వజమెత్తారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వైస్ పర్సన్ దీపా నర్సింలు, ప్రతిపక్ష కౌన్సిలర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, ఆసీఫ్, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్‌లు చేసిన వాఖ్యలపై సాయంత్రం పరిమళ్ గుప్త స్పందించి వారి విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనలుగురు కౌన్సిలర్లు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్నారు. అదే ఫ్రస్ట్రేషన్‌లో ఏదంటే అది వాగుతున్నారన్నారు. ఓ స్థలం విషయంలో తనకు 50 లక్షలు తీసుకున్నారని ఆసీఫ్ చేసిన ఆరోపణలను నిరూపించేందుకు అవకాశం ఇస్తున్నానని సవాల్ చేశారు. చేసిన ఆరోపణల స్థలం కాకుండా మరోస్థలం విషయంలో తనకు కొంతమంది బాగస్వాముల మద్య డబ్బులు వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంలో ఎక్కడిదాక అయినా వస్తానని, ఆసిఫ్ సిద్దమా అంటూ సవాల్ చేశారు. బడ్జెట్ విషయంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కౌన్సిల్ సమావేశానికి ఆపాదించడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో గుర్తింపు లేని సమయంలో ఎంఐఎం చేరి ఆ పార్టీకి ద్రోహం చేశారని, గత ఎన్నికల్లో ఎంఐఎం టిక్కెట్టు ఇవ్వకుంటే సీపీఎం పార్టీని ఆశ్రయించారని అన్నారు. దీనిపై ఎవరు పార్టీకి ద్రోహం చేస్తున్నారో అర్దమవుతుందన్నారు. డ్రగ్ విషయంలో చేసిన ఆరోపణలకు ఏ నిర్దారణ పరీక్షలకైనా సిద్దమన్నారు. నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు. ఆసీఫ్‌పై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని చెబుతూ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే బీజేపీ నాయకులు నోరుమెదపకపోవడంలో అంతర్యమేంటో అర్థం కావడంలేదన్నారు. మరోవైపు తనవైపు ఎవ్వరు లేరని చేసిన విమర్శలకు స్పందిస్తూ మీ నలుగురు గురించే మీడియా సమావేశం నిర్వహించామన్నారు. మీ నలుగురికి ఎమ్మెల్సీ వర్గంలో పనిలేదని.. మీ నలుగురికి నేనొక్కడినే చాలన్నారు. అవసరమైతే అణగదొక్కుతామని హెచ్చరించారు. వైస్ చైర్ పర్సన్ చేసిన దానయ్య వాఖ్యలకు నేను దానయ్యనే.. గతంలో ఈ దానయ్య అవసరానికి వచ్చిన సంగతిని ఆమె గుర్తుచేసుకోవాలన్నాని వ్యంగ్యంగా విమర్శించారు. ఇక శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ సహాకారంతోనే ఇసుక వ్యాపారం చేసిన విషయాన్ని మరిచి తిన్న కంచంలో మట్టిపోస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నోరు ఉందికదా అని ఏదంటే అది వాగోద్దని అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని మరోసారి సవాల్ చేశారు.

