బస్తీ దవఖాన ఏర్పాటు చేయండి
– ఎమ్మెల్యేతో కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వార్డులో ప్రజల కోసం బస్తీ దవఖానా ఏర్పాటు చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని 20 వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ కోరారు. మంగళవారం గల్లి గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, కౌన్సిలర్లతో కలిసి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా
వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఎమ్మెల్యే, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం వార్డులో నిరుపేద ప్రజలు ఎక్కువగా జీవిస్తున్నారని, కావున వార్డులో బస్తీ దవఖాన ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా జంతువధశాల (స్లాటర్ హౌస్ camila) తరలింపు, అంగన్‌వాడి కేంద్రానికి భవనం, మిషన్ భగీరథ కింద నీటి సమస్య, మురుగు కాలుల నిర్మాణం చేపట్టి, పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.

