వేసవిలో చల్లనిసేవ అభినందనీయం
– మున్సిపల్ వైస్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మండు వేసవిలో ప్రజలకు చల్లని సేవలు అందించడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ భర్త స్వర్గీయ కోట్రిక వెంకటయ్య వర్ధంతి సందర్భంగా పట్టణంలోని చించొల్లి రోడ్డు మార్గంలో వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రానికి మజ్జిగ, అంబలిని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హాజరై కోట్రిక విజయలక్ష్మితో కలిసి బాటసారులకు, ప్రజలకు చల్లని మజ్జిగ, అయిలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో పేదలకు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, అంబలిని పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు కోట్రిక శ్రీకాంత్, తర్లపల్లి భాను, వాసవి క్లబ్ అధ్యక్షులు గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


