కరుణించు కట్టమైసమ్మ తల్లి..!
– బోనమెత్తిన సాయిపూర్
– ఘనంగా జాతర ఉత్సవాలు
– దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరుణించు కట్టమైసమ్మ తల్లీ అంటూ తాండూరు పట్టణం సాయిపూర్ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం సాయిపూర్లో శ్రీ కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర సందర్భంగా ఆదివారం ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయానికి చేరుకుని ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు జాతరలో భాంగంగా సాయిపూర్ భక్తులు, మహిళలు ఇంటింటి నుంచి బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాల ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు డీసీపీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నమాల నర్సింలు కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, రాము, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగో పాల్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఉప్పరి మల్లేశం, మహిపాల్ రెడ్డి, నాయకులు, సాయిపూర్ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

