శోభాయాత్ర ముగింపు స‌హాకారం ఆద‌ర్శ‌నీయం

తాండూరు వికారాబాద్

శోభాయాత్ర ముగింపు స‌హాకారం ఆద‌ర్శ‌నీయం
– తాండూరు ప్ర‌జ‌ల‌కు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్ర‌శంస‌లు
– జిల్లా ఎస్పీ చ‌ర్య‌లను అభినందించి నాయ‌కులు, ప్ర‌జ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలో హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన శోభాయాత్ర ప్ర‌శాంతంగా ముగియ‌డంపై వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. శోభాయాత్ర ముగింపుకు అంద‌రు స‌హ‌క‌రించ‌డం ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తాండూరులో చేప‌ట్టిన బందోబ‌స్తు చ‌ర్య‌లు ఫ‌లించాయి. ఉద‌యం నుంచే ఎస్పీ కోటిరెడ్డి తాండూరులో ప‌ర్య‌టించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షించారు. బందోబ‌స్తు కోసం వ‌చ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది, బ‌ల‌గాల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేశారు. అనంత‌రం శోభాయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అందించిన స‌హాకారంకు ఎస్పీ కోటిరెడ్డి ముచ్చ‌ట ప‌డ్డారు. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా న‌డుచుకోవ‌డంపై తాండూరు ప్ర‌జ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక ముందుకు ప్ర‌జ‌లు పోలీసుల‌కు ఇలాంటి స‌హాకారాలు అందించాల‌ని అభిలాషించారు. మ‌రోవైపు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శోభాయాత్ర‌కు తీసుకున్న చ‌ర్య‌ల‌పై తాండూరు ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేకోకుండా శోభాయాత్రను ముగించిన తీరుకు ఎస్పీ కోటిరెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.