22 త‌రువాత గ్రూపు-1 నోటీఫికేష‌న్..?

కెరీర్ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

22 త‌రువాత గ్రూపు-1 నోటీఫికేష‌న్..?
– నియామక విధానంలో మార్పులు
– నేడు టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక సమావేశం
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీ, గ్రూపు-1 నోటిఫికేష‌న్ల జారీకి క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేసింది. ఈనెల 22న నోటిఫీకేష‌న్ జారీకి స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. 503 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 19 శాఖల్లోని పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీకి చేరాయి. ఒకటెండ్రు శాఖల్లో అర్హతలు, ఇతర అంశాలపై ఆయా శాఖల నుంచి స్పష్టత కోరారు. దీనిపై ఆయా అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. అన్ని అంశాలు కొలిక్కి రావటంతో కమిషన్‌ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతున్నది. ఈ సమావేశంలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌పైనే చర్చ జరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ నెల 22న కమిషన్‌ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ రెండు సమావేశాలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశాలున్నట్టు తెలిసింది.
ప్రక్రియ వేగవంతం…
ఇంటర్వ్యూల రద్దుతో ఉద్యోగ భర్తీ ప్రక్రియను రెండు, మూడు నెలల ముందే పూర్తి చేయవచ్చు. వివిధ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సగటున ఒక వ్యక్తికి అరగంట సమయం పడుతుంది. ప్రస్తుతం 503 ఉద్యోగాల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. గత విధానం ప్రకారమైతే మెయిన్‌ పరీక్షల అనంతరం 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిస్తే 1,509 మందిని ఇంటర్వ్యూ చేయాలి. ఒకో అభ్యర్థిని అరగంట చొప్పున రోజుకు కనీసం 20 నుంచి 25 మందిని ఇంటర్వ్యూ చేసినా ఈ ప్రక్రియ పూర్తికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఇంటర్వ్యూల రద్దు నిర్ణయంతో అనుకున్న సమయం కంటే ముందే నియామక ప్రక్రియను పూర్తి చేయవచ్చని సర్కారు భావిస్తున్నది.