ప్రశాంత్ గౌడ్‌ మ‌ర‌ణం బాధాక‌రం

తాండూరు వికారాబాద్

 ప్రశాంత్ గౌడ్‌ మ‌ర‌ణం బాధాక‌రం
– నివాళులు అర్పించిన తాండూరు ఉద్యోమ కారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడు ప్రశాంత్ గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం కోడంగల్ నియోజకవర్గం దుద్యాల్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టీజేఎస్ తాండూరు ఇంచార్జ్ సాంబూరు సోమశేఖర్, తాండూరు ఉద్యమకారులు దత్తు, ప్రకాష్ గౌడ్, భాను, రామకృష్ణ తదితరులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రప్రశాంత్  గౌడ్ పార్ధివ దేహాన్ని మోసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారు ప్రార్ధించారు. తెలంగాణ ఉద్య‌మంలో ప్రశాంత్ గౌడ్ చురుకుగా పాల్గొనే వాడ‌ని గుర్తుచేసుకున్నారు. ఆయ‌న జీవితం అర్దంతరంగా ముగియ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.