టీఆర్ఎస్ కేవీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులుగా న్యాయ‌వాది గోపాల్

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్ కేవీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులుగా న్యాయ‌వాది గోపాల్
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా నియామ‌క‌ప‌త్రం అంద‌జేత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం(కేవీ) తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులుగా ప్ర‌ముఖ న్యాయ‌వాది గోపాల్ నియామ‌క‌మ‌య్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా నియామ‌క‌ప‌త్రం అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌వాది గోపాల్ మాట్లాడుతూ కార్మిక విభాగం నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులుగా నియ‌మించ‌డం ప‌ట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప‌నిచేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు టీఆర్ఎస్‌లో స‌ముచిత స్థానం ఉంటుంద‌ని నిరూపిత‌మ‌య్యింద‌న్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాయ‌క‌త్వంలో పార్టీ బ‌లోపేతంతో పాటు తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందుతోంద‌న్నారు. ఎన్‌హెచ్167, బైపాస్ రోడ్డు, ఫోర్ లైన్ హైవే రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభిస్తూ తాండూరును ఆద‌ర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే కృసి చేస్తున్నార‌ని అన్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో నియోజ‌క‌వ‌ర్గంలోని కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తాన‌ని పేర్కొన్నారు.