ఈనెల 28న ముస్లింకు ఇఫ్తార్ విందు
– ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ నెల 28న ముస్లిం సోదరులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసుకున్న ఇఫ్తార్ విందుకు సహాకారం అందిస్తున్నట్లు తెలిపారు. 28న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు మసూద్, మైనార్టీ నాయకులు అబ్దుల్లా, షౌకత్ పటేల్, మహమూద్ ఖాన్, యూసుఫ్ ఖాన్, ఖుర్షీద్ హుస్సేన్, కమల్ అతహర్, బాబర్ అజహర్ మౌలానా, గఫూర్, కరీ, టీఆర్ఎస్ నాయకులు అశోక్, శ్రీకాంత్ రెడ్డి, దత్తూ తదితరులు పాల్గొన్నారు.


