విద్యార్థుల పట్ల బాధ్యతగా మెలగండి
– సమయానికి బస్సులు నడిపించండి
– టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ
తాండూరు, దర్శిని ప్రతినిధి: పరిక్షలకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకండా అందరు బాధ్యతగా వ్యవహరించాలని టీఆర్ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు ముగ్గురు విద్యార్థులు నిమిషం నిబంధన కారణంగా దూరం కావడం బాధాకరమన్నారు. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు సమయానికి బస్సులను నడిపించాలని తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్‌ను కోరారు. అదేవిధంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు దారుల్లో ఇబ్బందులు పడితే వాహనదారులు వారికి లిఫ్టు అందించాలని విజ్ఞప్తి చేశారు. వీలైతే వారిని పరీక్షా కేంద్రాల వద్ద వదిలిపెట్టాలని కోరారు. మరోవైపు విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా కేంద్రాల నిర్వహకులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించి న్యాయం చేయాలని కోరారు. దీంతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడ వారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అందరు విద్యార్థులకు బాధ్యతగా వ్యవహరించిన వారి ఉన్నత భవిష్యత్తుకు తోడ్పాడాలని పేర్కొన్నారు.

