నకలీ విత్తనాలపై నజర్
– విక్రయించే వారిపై పీడీయాక్టు
– విక్రయాల నియంత్రణకు స్పెషల్ టీంలు
– పాత నేరస్తులకు కౌన్సిలింగ్‌లు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్
వికారబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్ ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటి రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలనికి రైతులు ఉపయోగించే విత్తనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో నకిలీ, నాణ్యతా లేని విత్తనాలు అమ్మే వారిపై సీరియస్ గా వ్యవహరించారు. వాటిని తయారు చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అట్టి వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని పేర్కొన్నారు. పాత నేరగాళ్ల పైన ప్రత్యేక దృష్టి ఉంచి వారికి కౌస్సెలింగ్ ఇవ్వాలని అన్నారు. నకిలీ విత్తనాలను విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక మైన టీమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారుల సహాయంతో సీడ్స్ దుకాణాలను ఎప్పటి కప్పుడు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు కూడ నకిలీ విత్తనాలను కొని మోసపోవద్దని సూచించారు. అలాంటి వాటికి గురైతే పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
పెండింగ్ కేసులను పూర్తి చేయాలి
మరోవైపు జిల్లా ఎస్పీ జిల్లాలో నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను వెంటనే పూర్తి చేయాలని, పోలీస్ అధికారులందరు రోడ్డు ఆక్సిడెంట్ లు, ఆత్మహత్యలు జరుగుటకు కారణాలు తెలుసుకొని వాటిని తగ్గించాలని అన్నారు. ప్రమాదాలపై పోలీస్టేషన్‌లలో కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. దీంతో పాటు అక్రమ ఇసుక రవాణా, గుట్కా రేషన్ బియ్యం రవాణాలను అరికట్టాలని ఆదేశించారు. అదేవిధంగా సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలన్నారు. వీకెండ్ లలో డ్రంక్ & డ్రైవ్, ఓపెన్ బుజింగ్ మరియు వెహికిల్ చెకింగ్ ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి శనివారం రోజు వర్టికల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎలాంటి పెండింగ్ వుండకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, తాండూరు, వికారాబాద్ డీఎస్పీలు, జిల్లాలోని వివిధ పోలీస్టేషన్ల ఇనుస్పెక్టర్లు, సర్కిల్ ఇనుస్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


