70 ఏండ్ల చింత తీర్చిన పైలెట్

తాండూరు రాజకీయం వికారాబాద్

70 ఏండ్ల చింత తీర్చిన పైలెట్
– ప‌టేల్ చింత తాండాకు రోడ్డు
– మిష‌న్ భ‌గీర‌థతో తాగునీరు
– హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న తాండా వాసులు
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా యాలాల మండ‌లంలోని మారుమూల‌ తాండా ఆది. 70 ఏండ్ల స్వాతంత్ర్యంలో తాండాకు రోడ్డు సౌక‌ర్యం కూడ లేదంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. కాని ఇది వాస్త‌వం. అలాంటి తాండాకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏండ్లుగా తాండా వాసుల్లో నాటుకుపోయిన చింత‌ను తీర్చేశారు. యాలాల మండ‌లం ప‌టేల్ చింత తాండాలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గ‌తంలో ప‌ర్య‌టించారు. అప్ప‌ట్లో తాండాకు రోడ్డు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని తాండా వాసులు ఎమ్మెల్యేతో మొర‌పెట్టుకున్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండాకు రోడ్డు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామి ఇచ్చారు. ఇచ్చిన హామి మేర‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవ చూపి తాండాలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేశారు. రూ.1 కోటి.20 లక్షలతో రోడ్డుతో పాటు రూ.30 లక్షలతో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరాకు ఆదేశించాడం పట్ల తాండ వాసులు హర్షం వ్యక్తం చేశారు. శ‌నివారం తాండాలో సీసీ రోడ్డు ప‌నుల ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తాండా వాసులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.