ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
– జెండాలు ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ వేడుకలు తాండూరులో గురువారం ఘనంగా జరుపుకున్నారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జెండా ఆవిష్కరించగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు జెండా ఎగురవేశారు.
దీంతో పాటు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి నివాసం వద్ద పార్టీ నాయకులు ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. ఆదేవిధంగా పట్టణంలోని ఆర్డీఓ, పోలీస్టేషన్, డీఎస్పీ, మార్కెట్ కమిటీ, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, డీసీఎంఎస్ తదితర కార్యాలయాలలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్ సర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, రాజుగౌడ్, హరిగౌడ్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ ఇతర పార్టీలు, ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ తెలంగాణను పోరాడి సాధించుకోవడంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహనీయుల కృషి ఎంతో ఉందన్నారు. బంగారు తెలంగాణతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నివాసం వద్ద జరిగిన వేడుకలలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, బోయరవి, వెంకన్నగౌడ్, పార్టీ నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, రాజశేఖర్, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, టీఆర్ఎస్ కార్మిక విభాగం తాండూరు అధ్యక్షులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఫ్లోరీడర్లు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలోని అంగన్ వాడి కేంద్రాల్లో కౌన్సిలర్లు జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు.
ఆవిర్భావ వేడుకలకు సంబంధించి మరిన్ని ఫోటోలు




