పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం
– సన్మానించిన కౌన్సిలర్ వెంకన్న గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని తాండూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గత 15 రోజులుగా కొనసాగిన పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం రాజీవ్ కాలనీలో మున్సిపల్ సన్మానం నిర్వహించారు. కౌన్సిలర్ వెంకన్న గౌడ్ ఏరియా జవాన్, కార్మికులకు శాలువా, పూలమాలతో సన్మానించారు. పట్టణ ప్రగతిలో వార్డులో పారిశుద్ధ్య పనులు, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టడంతో వార్డును సుందరంగా తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. వారి సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, ఏరియా జవాన్ అశోక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.