పేదల ఆరోగ్యానికి సర్కారు భరోసా
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ సర్కారు భరోసా అందిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో మహేందర్ రెడ్డి తాండూరు డివిజన్‌లోని కోట్ పల్లి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు, తాండూరు పట్టణం ఇంద్రనగర్‌కు చెందిన అడివప్ప అనే లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ సర్కారు భరోసా అందిస్తుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్, నాయకులు మసూద్, కోట్ పల్లి మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు నక్కల బందయ్యా తదితరులు పాల్గొన్నారు.



