ముంపు హామిలు నీటి మూట‌లు

తాండూరు రాజకీయం వికారాబాద్

ముంపు హామిలు నీటి మూట‌లు
– గ్రీన్ కష్టాలను పట్టించుకోని చైర్ పర్సన్
– కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పట్టణంలోని గ్రీన్ సిటీ, మార్కండేయ కాలనీలో ముంపు కష్టాలను తీరుస్తామ‌ని ఇచ్చిన హామిలు వ‌ర‌ద నీటి మూట‌ల‌య్యాయ‌ని తాండూరు మున్సిప‌ల్ 13వ వార్డు కౌన్సిల‌ర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడ‌ర్ వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి విమ‌ర్శించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రీన్ సిటి, మార్కండేయ కాల‌నీల‌లో నిలిచిన వ‌ర‌ద‌ నీటిని శనివారం వరాల శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి జేసీబీ యంత్రంతో తొలగించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వార్డులో పర్యటించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముంపు కష్టాలు, డ్రైనేజీ ఇబ్బందులు తీరుస్తామని చెప్పి నేరవేర్చలేకపోయారని విమర్శించారు. ఆమె వ్యవహారం వల్లే అభివృద్ధిని అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆరోపించారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. ఇప్పటికైనా మొండి వైఖరి వీడి ప్రజల ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు.