కుల వృత్తుల అభ్యున్నతికి పెద్దపీట
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కుమ్మరి వృత్తిదారులకు యంత్రాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని శ్రీ స్వామి రామానంద తీర్థ కళాశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గం యాలాల మండలంకు చెందిన కుమ్మరి శ్రీశైలం, పెద్దేముల్ మండలంకు చెందిన కుమ్మరి విఠల్ లు పాల్గొన్నారు. వారికి ప్రభుత్వం సబ్సీడీ కింద పోట్టరి మిషన్లను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కులవృత్తి దారులకు మంజూరైన యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కులవృత్తి దారుల అభివృత్తికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, యాలాల మండల పార్టీ అధ్యక్షులు : రవీందర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.



