భక్తుల ఇంటికి మల్లికార్జున స్వామి
– అప్పాజీని సన్మానించిన భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రంకు చెందిన శ్రీ మల్లికార్జున స్వామీ (అప్పాజీ) తాండూరులోని భక్తుల నివాసాల్లో సందడి చేశారు. ఆదివారం రాత్రి తాండూరు పట్టణానికి చెందిన స్వర్గీయ డా. శేఖర్ కుమారుడు డా. హరీష్ నివాసానికి వెళ్లారు. సాయిపూర్లోని శ్రీ వాసుదేవ సూపర్ మార్కెట్ యజమాని ప్రభాకర్ రెడ్డి షాపు, మల్లికార్జున స్వామి ట్రస్టు అధ్యక్షులు దర్మీది రవిశంకర్, చంద్రకళ దంపతులతో పాటు మాజీ సర్పంచ్ కేశవరావు నివాసం, తాండూరు మండలం చెంగల్ గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ నిర్మించిన నూతన ప్రవేశ వేడుకలలో మల్లికార్జున స్వామి హాజరయ్యారు. వారి వారి నివాసాల్లో భక్తులు స్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అప్పాజీ స్వామి భక్తులును ఆశీర్వదించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి అప్పాజీ స్వామీ ఆశీర్వాదాలతో అందరు సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం అప్పాజీ స్వామిని వారు ఘనంగా సన్మానించారు.
ఇదికూడా చదవండి..

