గ్రాండ్‌గా 2కే రన్..!
– ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– పాల్గొన్న డీఎస్పీ శేఖర్ గౌడ్, అధికారులు
– తాండూరు మండలంలో తరలివచ్చిన యువత
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని ఆజాదీకా అమృతోత్సవ్, వజ్రోత్సవ్‌లో భాగంగా తాండూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2కే రన్ గ్రాండ్‌గా జరిగింది. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో గురువారం ఉదయం 6గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది కలిసి ర్యాలీని ప్రారంభించారు.

కళాశాల మైదానం నుంచి పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వరకు కొనసాగిన ఈ 2కే రన్‌లో దాదాపు 250 మంది పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న నేతలు, యువకులు, పోలీసులు దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు పట్లొళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు నీరటి హన్మంతు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ ఆధ్వర్యంలో 2కే రన్ చేపట్టారు.

మండలంలోని గౌతాపూర్ లో చెంగోల్ రోడ్డు మార్గం నుంచి చెంగోల్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాండూరు రూరల్ సీఐ రాంబాబు కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డితో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, గౌతాపూర్ సర్పంచ్ రాజప్పగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ తదితరులు పాల్గొన్నారు.



