పండగలా బాపనోళ్ల శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు
– ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన సతీమణీ చంద్రకళ
– విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన తండ్రి, కుమారుడు
– ముంబయిలో వరసిద్ది వినాయకున్ని దర్శించుకున్న శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు సోమవారం పండగలా జరుపుకున్నారు. వ్యాపార నిమిత్తం ముంబయి వెళ్లిన శంకర్ యాదవ్ అక్కడ వరసిద్ధి వినాయకున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అదేవిధంగా తాండూరులో శంకర్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి చంద్రకళ తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తాండూరు మండలం చెంగోల్, చింతామణిపట్నం గ్రామాల్లో శంకర్ తండ్రి హనుమయ్య, శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళ, కుమారుడు అభినవ్ సాయిలతో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుపుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో చెంగోల్ ఎంపీటీసీ రత్నమాల, శంకర్ యాదవ్ మిత్ర బృందం బంటు మల్లప్ప, ఉపసర్పంచ్ లక్ష్మయ్య, రాము, సాయిపుత్ర సేవా సమితి సభ్యులు మల్ రెడ్డి, మల్లేశ్ యాదవ్, కిరణ్ యాదవ్, వెంకటేష్, అరుణ్, మధు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముంబయిలోనే శంకర్ యాదవ్ కు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు వేణుగోపాల్ రెడ్డి, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, మిత్రులు జొన్నల వినోద్ కుమార్, మనోహర్ యాదవ్, ప్రేమ్ కుమార్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.



