తీరొక్క అలంకరణలో వరలక్ష్మీ దేవి
– వెల్లివిరిసిన ఆద్యాత్మికం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వరాలిచ్చే వరలక్ష్మీదేవిని మహిళలు తీరొక్క రూపంలో కొలిచారు. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా పాటించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా
పట్టణంలోని ఇందిరానగర్, గ్రీన్‌సీటి, విశ్వంబర కాలనీ, గుమాస్తానగర్, మల్‌రెడ్డిపల్లి, సాయిపూర్ తదితర ప్రాంతాలలో ఇండ్లలో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్ష్మీదేవికి తీరోక్క అలంకరణలు చేసి భక్తిశ్రద్దలతో పూజించారు. ఇంటింటా వరలక్ష్మీ వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
