పేదింటిని వెంటాడుతున్న చావులు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదింటిని వెంటాడుతున్న చావులు
– ఒకే కుటుంబంలో ముగ్గురి కన్నుమూత
– రోజుల వ్యవధిలో తల్లి, భర్త, భార్య మృతి
– ఆర్థిక చేయూతను చాటుకున్న ఎమ్మెల్యే సోదరుడు
– మానవత్వంతో అండగా నిలిచిన గ్రామ నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓ పేదింటిని చావులు వెంటాడాయి. రోజుల వ్యవధిలోనే తల్లి, కుమారుడు, భార్యలు కన్నుమూశారు. ఈ విషాధకర ఘటన తాండూరు మండలం అంతారం గ్రామంలో జరిగింది. బాధలో ఉన్న కుటుంబానికి నేతలు ఆర్థిక చేయూతను అందించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కేసీ నర్సింలు కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. నర్సింలు భార్య నాగమణి తల్లి నర్సమ్మ(60) అనారోగ్యానికి గురై గత జనవరి 29న కన్నుమూసింది. ఆ వెంటనే తరువాతి నెల ఫిబ్రవరి 5న పాలిషింగ్ యూనిట్లో పనికి వెళుతున్న కేసీ నర్సింలును లారీ ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ క్రమంలో తల్లి, భర్తను కోల్పోవడంతో నాగమణి తీవ్ర మనోవేధనకు గురైంది. కుటుంబానికి పెద్ద అయిన తల్లి, పోషించే భర్త దూరం కావడంతో బెంగతో ఆమె అన్న పానీయాలు మానేసింది. వారి చావులను తలుచుకుని చివరకు శుక్రవారం ప్రాణాలను విడిచింది. అప్పటికే రెండు చావులను చూసిన కుటుంభ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదరయ్యాయి. నాగమణి అంత్యక్రియల కోసం దాతల సాయంను కోరారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా భూకైలాస్ దేవాలయ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ రూ. 5వేలు, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ రూ. 2వేలు. అంతారం మాజీ సర్పంచ్ వడ్డె శేఖర్ రూ. 2వేలు ఆర్థిక సాయం అందించి కుటుంబానికి భరోసా అందించారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు అండగా ఉంటామని గ్రామ నె తలు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శాంతుకుమార్, గ్రామస్తులు ఉన్నారు.

లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!