జన్మదినానికి జాతీయ జెండే బహుమతి
– జర్నలిస్టుకు అందజేసిన బీజేపీ జిల్లా కార్యదర్శి యు.రమేష్ కుమార్
– వినూత్నంగా ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత దేశంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ఢీల్లి నుంచి గల్లీ దాకా ఆజాదీకా అమృతోత్సవ్, వజ్రోత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రవేటు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాలు ఉత్సహాంగా జరుగుతున్నాయి. అక్కడక్కడమే మాత్రమే జాతీయ జెండా పంపిణీల కార్యక్రమం వినూత్నంగా జరుగుతున్నాయి. అలాంటి సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. భారతీయ జనత పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నేతలు ఇటీవలే ఓ వివాహా వేడుకకు హాజరై జాతీయ జెండాను కానుకగా అందజేశారు. తాజాగా ఆదివారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మండల వార్తా జర్నలిస్టు ప్రసాద్ గౌడ్ జన్మదినం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ చేతులమీదుగా జాతీయ జెండాను బహుకరించారు. పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జన్మదినం సందర్భంగా జాతీయ జెండాను బహుమతిగా అందించడంతో ఆజాదీకా అమృతోత్సవ్ను వినూత్నంగా చేపట్టంపై పలువురు అభినందలు తెలుపుతున్నారు.



