నూతన సాగు పద్దతులతో అధిక దిగుబుడులు
– తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా.సుధాకర్
– జిల్లా ఉత్తమ రైతులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వ్యవసాయంలో నూతన సాగు పద్దతలును పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.సీ. సుధాకర్ అన్నారు. శుక్రవారం ఫ్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాండూరు ఏరువాక కేంద్రం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సుధాకర్, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎన్. ప్రవీణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో జిల్లాలోని ఉత్తమ రైతులకు సన్మానం ఏర్పాటు చేశారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జే.జ్యోతి, వికారాబాద్ జిల్లా ఎన్నేపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ నగేష్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా.సుధాకర్ మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్దతులను పాటించడం వల్ల సాగులో ఖర్చులను ఆదా చేసుకోవచ్చాన్నారు. అంతేకాకుండా అధిక దిగుబడులను కూడ సాధించవచ్చన్నారు. ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు కందిలో జంటసాళ్ల పద్దతి, నాటువేసే పద్దతులను పాటించాలన్నారు. అదేవిధంగా సేంద్రీయ పద్దతులను అవలంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సీ. యమున, మాణిక్యమణి, సందీప్, రాజేశ్వర్ రెడ్డి, వివిధ ప్రాంతాల రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
