రేపు తాండూరుకు శివదత్త మృతదేహం
– అదే రోజు అంత్యక్రియలకు ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: యునైటేడ్ స్టేట్స్ మిస్సోరిలో తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన వైద్య విద్యార్థి శివదత్త మృతదేహాన్ని తీసుకవచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు శనివారం మృతదేహం తాండూరు పట్టణానికి వస్తున్నట్లు కుటుంబ సన్నిహితులు తెలిపారు. తాండూరు పట్టణంలోని అపెక్స్ హాస్పిటల్ యజమాని వెంకటేశం, జ్యోతిలకు ఇద్దరు కుమారులు విక్రమ్, రెండో కుమారుడు శివదత్త(25)లో యూఎస్‌లోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్సీటి(ఎస్ఎల్యూ) యూనివర్సిటిలో డెంటల్ కోర్సు చదువుతున్నాడు. గత నెల నవంబర్ 26న శనివారం మధ్యాహ్నం శివదత్త అతని స్నేహితుడుతో సలి మిస్సోరిలోని ఓజార్క్ సరస్సు(లేక్) వద్దకు వెళ్లి అక్కడ ప్రమాద వశాత్తు ఇద్దరు మునిగిపోయి మృతి చెందిన విషయం తెలిసిందే. శివదత్త మృతదేహాన్ని అప్పగించడంలో ఆలస్యం జరిగింది. వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ద్వారా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ఇంచార్జ్ పటేల్ రవిశంకర్ సైతం ఆరా తీసి తోడ్పాటు అందించేందుకు సహకరించారు. యూస్‌లో అన్ని నిబంధనలు పూర్తి చేసి ఇండియాకు పంపించేందుకు అంగీకరించారు. దీంతో రేపు శనివారం ఉదయాన్ని కల్ల ఇండియాకు.. అక్కడి నుంచి తాండూరుకు తీసుకవచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. శనివారం మధ్యాహ్నం తాండూరు పట్టణంలో శివదత్త అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా మృతి చెందిన వారం రోజుల తరువాత శివదత్త మృతదేహం తాండూరుకు రాబోతుంది.

