అఫ్పూను అభినందించిన మంత్రి మల్లారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అభినందించారు. టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులుగా అఫ్పూ నియామకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అఫ్పూను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరులో అందరి సమన్వయంతో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
