వ్యవసాయ అభివృద్ధిలో రైతులే కీలకం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

వ్యవసాయ అభివృద్ధిలో రైతులే కీలకం
– తాండూరు కందికి గుర్తింపు సంతోషకరం
– వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యవసాయ రంగ అభివృద్ధిలో రైతుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్ర వేత్త సీ.సుధాకర్, ఏడీఏ రుద్రమూర్తి, హెచ్‌డీఎఫ్‌సీ తాండూరు బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ లు అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సీ.సుధాకర్, ఏడీఏ రుద్రమూర్తి, హెచ్‌డీఎఫ్‌సీ తాండూరు బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ లు హాజరై మాట్లాడుతూ తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి రైతులే వెన్నెముకలా నిలుస్తున్నారని, వ్యవసాయ రంగ అభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమన్నారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్దతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని పది మంది ఆదర్శ రైతులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు రాజేశ్వర్ రెడ్డి, సుజాత, యమునా రెడ్డి, సందీప్, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.