రైళ్ల సర్వీసును పునురిద్దంచాలి
– రైల్వే పీఏసీ బృందానికి బీజేపీ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మీదుగా వెళ్లే రైళ్ల సర్వీసులను పునరుద్దించేలా చూడాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల సౌకర్యాల కమిటి(పీఏసీ) బృందాన్ని స్థానిక బీజేపీ నేతలు కోరారు. మంగళవారం తాండూరు రైల్వే స్టేషన్ సందర్శనానికి వచ్చిన పీఏసీ సభ్యురాలు ఉమారాణిని కలిసి నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాండూరు మీదుగా వెళ్లే హైదరాబాద్ ఇంటర్ సిటి రైలు సర్వీసు కరోనా నేపథ్యంలో ఆగిపోయిందని గుర్తుచేశారు. ఈ మార్గంలో ఇంటర్ సిటీ సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకంగా ఉండేదని, కావున ఈ సర్వీసును తిరిగి పునరుద్దించేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా తాండూరు రైల్వే స్టేషన్ ఆవరణలో 25 మీటర్ల జాతీయ జెండా ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందా రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, నాయకులు ఎం. రమేష్, నందకుమార్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు.

