రేణుకా ఎల్లమ్మ తల్లి నమోస్తుతే..!
– పంచవర్ణ చీరలతో ప్రత్యేక అలంకరణ
– దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మను దేవీ నమోస్తుతే అందూ కీర్తించారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ పూజారి అంమ్రేష్ సమక్షంలో అమ్మవారిని పంచవర్ణ రంగులతో కూడిన ఐదు చీరలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మరోవైపు ఆలయంలో నేడు శ్రావణమాసం భజన సమాప్తి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషణ్ తెలంగాణ రాష్ట్ర యూత్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్, తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నము అన్నదానము నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 5 గంటల వరకు భజన సమాప్తి చేపడుతున్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటి సభ్యులు కోరారు.
ఇది కూడా చదవండి…

