తాండూరు అసెంబ్లీ పోటికి సై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు అసెంబ్లీ పోటికి సై..!
– కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసిన రఘువీర్‌ రెడ్డి
– గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అసెంబ్లీ పోటీకి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువీర్‌ రెడ్డి సై అన్నారు. అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన దరఖాస్తు ఫారాన్ని అందజేశారు. మంగళవారం పార్టీ నేతలతో కలిసి గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌డకు రఘువీర్‌ రెడ్డి ఈ దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ సామాన్య కార్యకర్త నుండి ప్రారంభం అయిన రాజకీయ జీవితం నేడు పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వరకు కొనసాగిందని గుర్తుచేసుకున్నారు. ఇంతటి స్థాయికి ఎదగడానికి కార్యకర్తల కృషి, నాయకుల సహకారం ఉందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకుల సహకారంతో పాటు పార్టీ అధిష్టానం ఆశీస్సులతో అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి…

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!