ఎండీ అంజద్‌కు ఉత్తమ హెడ్‌ కానిస్టేబుల్‌కు అవార్డు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఎండీ అంజద్‌కు ఉత్తమ హెడ్‌ కానిస్టేబుల్‌కు అవార్డు
– జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రధానం
– సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎండీ అంజద్‌కు ఉత్తమ ప్రశంసలు అందాయి. గురువారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కె. నిఖిల చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రతి యేడాది ఉత్తమ అధికారులు, సిబ్బందికి ఉత్తమ అవార్డులు అందించి ప్రశంసించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అంజద్‌కు ఉత్తమ గౌరవం దక్కింది. జిల్లా కలెక్టర్ కె.నిఖిల చేతుల మీదుగా అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీల సమక్షంలో ఎండీ అంజద్ ఉత్తమ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లు ఎండీ అంజద్‌ను అభినందించారు. ఉత్తమ ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో ఆయనను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఉత్తమ పనితీరుతో.. విధులు నిర్వహించి మరిన్ని అవార్డులతో పాటు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.