దుర్గామాతా సేవలో శంకర్ యాదవ్
– అమ్మవారికి ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుని అమ్మవారి సేవలో తరించారు. పూజల అనంతరం కుటుంబ సభ్యులు అభినవ్ సాయి, తులసీ, వైష్ణవి, ఐశ్వర్యలతో కలిసి అన్నదానం చేశారు. అనంతరం ఉత్సవ కమిటి సభ్యులు అమిత్ శిందే, నరేష్ గదరే, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, లోకేష్, నారాయణ శిందే, అనిల్‌లు శంకర్ యాదవ్, మిత్ర బృందాన్ని సన్మానించారు. ఈ సందర్బంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ దుర్గామాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను అందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్, మిత్రులు జొన్నల వినోద్ కుమార్, మనోహర్ యాదవ్, హిందూ సమితి కార్యదర్శి బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, న్యాయవాదులు పాశం రవికుమార్, ప్రేమ్ కుమార్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
