తాండూరులో ఐటీ దాడులు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో ఐటీ దాడులు..!
– శ్రీ దుర్గా గ్రాండ్యూర్‌లో తనిఖీలు
– బసచేసిన వ్యక్తి నుంచి నగదు గుర్తింపు..?
– అధికార పార్టీకి నేతతో సంబంధాలపై ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు చేపట్టారు. ఈ సంఘటన శనివారం తాండూరులో కలకలం సృష్టించాయి. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని శ్రీ దుర్గా గ్రాండ్యూర్ బార్ అండ్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన కింగ్స్ గ్రూప్స్ అనే వ్యాపార సంస్థలో భాగస్వామిగా ఉన్న ఓ వ్యక్తి దుర్గా గ్రాండ్యూర్ లోని ఓ గదిలో బస చేస్తున్నారు. ఇది వరకే హైదరాబాద్ లో కింగ్స్ గ్రూపులో ఐటీ అధికారులు దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన భాగస్వామి తాండూరులోని గ్రాండ్యూర్ లో బస చేయడంతో ఐటీ అధికారులు ఇక్కడికి వచ్చి సోదాలు చేసినట్లు తెలుస్తోంది.

అన్ని సోదాల అనంతరం అతని వద్ద నుంచి రూ.24 లక్షల నగదును స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కింగ్స్ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఈ వ్యక్తికి తాండూరు అధికార పార్టీకి చెందిన యువ నాయకుడితో సంబంధాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ మేరకు ఆ కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంఘటన తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!