ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
– చికిత్స అందిస్తున్నామన్న వైద్యులు
– హెల్త్ బులిటన్‌లో వైద్యులు ఏమన్నారంటే..?

దర్శిని డెస్క్‌: కాంగ్రెస్ అధినేత్రి, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(76) ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్‌ గంగా రామ్ ఆస్పత్రిలో ఆమెను చెర్పించారు. గతంలోనూ సోనియాకు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ జరిగింది. అప్పటి నుంచి సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ సోనియాగాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సోనియాగాంధీ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు, అతని టీం ఆధ్వర్యంలో సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను సర్ గంగా రామ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉండాలని డాక్టర్లు తెలిపారు.