భీకరంగా వడగండ్ల వర్షం..!

ఆరోగ్యం తెలంగాణ వికారాబాద్

భీకరంగా వడగండ్ల వర్షం..!
– మర్పల్లిలో అరగంట కురిసిన వాన
– జిల్లాలో ద్రోణి చూపిన ప్రభావం
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో వడగండ్ల వాన భీకరంగా కురిసింది. జిల్లాలోని మర్పల్లిలో అరగంట పాటు ఈ వడగండ్ల వర్షం పడింది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలలో వడగండ్ల వర్షం, మెరుపులు, మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భీకరమైన వడగండ్లు, మెరుపులు.. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ప్రభావం ఉందని హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం జిల్లాలో అకాల వర్షం కురిసింది. మర్పల్లిలో వర్షంతో పాటు వడగండ్లు కురిశాయి. రహదారులన్నీ వడగండ్లతో నిండుకున్నాయి. పెద్ద మొత్తంలో పడిన వడగండ్లతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వడగండ్ల వర్షాన్ని తిలకించారు. మరోవైపు జిల్లాలో అకాల వర్షాల ప్రభావం మరో నాలుగైదు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు పగలు, రాత్రి అప్రమత్తంగా ఉండాలని, రైతులు కూడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోలో వడగండ్ల వానను తిలకించండి…