ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో మోసం

తాండూరు రాజకీయం వికారాబాద్

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో మోసం
– కొత్త అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గం ఎన్నిక చెల్లదు
– అక్రమాలపై ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తాం
– అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొత్త కార్యవర్గం చేసే మోసాలను నమ్ముకుని అసోసియేషన్ అధ్యక్షులు ఖుర్షిద్ హుస్సేన్, హాది షహేరీలు అన్నారు. గురువారం అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈనెల 14న మదీన మసీదులో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమల్ ఆతహర్, ప్రధాన కార్యదర్శి ఖాలిద్ సైఫ్ ఉల్లా, మహమ్మద్ యూనుస్ లు ఎన్నికైనట్లు వచ్చిన ప్రకటనలో వాస్తవం లేదన్నారు. వారితో ముస్లిం అసోసియేషన్ కు సంబంధం లేదన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ చట్టానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని, కావున వారి ఎన్నిక చెల్లదన్నారు. నిజమైన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ 6607/1997తో రెజిస్ట్రేషన్ చేయబడిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి పలు దఫాలుగా ఎన్నుకున్న కార్యవర్గానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. ఇటీవల చేయబడిన రిజిస్ట్రేషన్ మేరకు అసోసియేషన్ అధ్యక్షులుగా మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ రహమాన్ ముజాహిద్, మహమ్మద్ జైనోద్దీన్, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ హాది షహేరీలు ఉన్నారని, గత యేడాది రెన్యూవల్ చేసిన ఈ కార్యవర్గ పదవి కాలం 2027 వరకు కొనసాగుతుందని వివరించారు, కావున కొత్త కార్యవర్గం ఎన్నిక చెల్లుబాటు కాదన్నారు. అదేవిధంగా వారు ముస్లిం అసోసియేషన్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ సభ్యత్వ నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొత్త కార్యవర్గంను పక్కన పెట్టి త్వరలోనే నిబంధనల మేరకు సబ్‌ కమిటి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ జమీల్ హైమద్, కోశాధికారి అబ్దుల్ సత్తార్, లాయకత్ అలీ, షౌకత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.