మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం
– తాండూరు వాసుల దుర్మరణం దురదృష్టకరం
– ఆర్టీసీ దుర్ఘటనపై అధికారిక విచారణ ముమ్మరం
– మూడు నెలల్లో తాండూరు వికారాబాద్ రోడ్డు పనులు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఆర్టీసీ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

రోడ్డు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 13 మంది మృతి చెందగా.. ప్రభుత్వం తరుపున రూ. 5లక్షలు, ఆర్టీసీ సంస్థ తరుపున రూ. 2 లక్షలు మొత్తం రూ. 7లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా ఆడిషనల్ కలెక్టర్ సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్టీసీ అధికారులతో కలిసి పరిహారం చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన సలేహా, ఖాలిద్. రెండు నెలల చిన్నారి. విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, వాల్మీకీనగర్ కు చెందిన వెంకటమ్మ, పాత తాండూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కు చెందిన అఖిల రెడ్డి, హాజీపూర్ గ్రామానికి చెందిన భార్యా భర్తలు లక్ష్మీ, బందెప్పలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిహారం చెక్కులను అందజేశారు.
kvcs
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ దుర్ఘటనలో తాండూరు వాసులే అధికంగా మృతి చెందడం దురదృష్టకరం అని అన్నారు. మృతుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలను అండగా నిలించేందుకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరుపున ఇంకా అందాల్సిన వాటిని కూడా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆర్టీసీ దుర్ఘటనపై ప్రభుత్వం అధికారిక విచారణ ముమ్మరం చేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు.

మూడు నెలల్లో తాండూరు వికారాబాద్ రోడ్డు
మరోవైపు తాండూరు వికారాబాద్ రోడ్డు పనులను పూర్తి చేయించేలా దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. సంబంధిత అధికారుల వెంబడి పడి పనులు చేపట్టేలా చూస్తామన్నారు. వచ్చే మూడు నెలల్లో తాండూరు –వికారాబాద్ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీప్యూటీ డీఆర్ఎం సరస్వతి, కాంగ్రెస్ నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మసూద్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బోయరవి, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు దర్నాపై సీరియస్..!