కురుమ సోదరులు అన్నింట్లో ముందుండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

కురుమ సోదరులు అన్నింట్లో ముందుండాలి
– మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ రాష్ట్ర వైస్ చైర్మన్ గా కుర్వ బాలు
– ఘనంగా సన్మానించిన కురుమ సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కురుమ సోదరులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని తాండూరు కురుమ సంఘం సభ్యులు ఆకాంక్షించారు. భారత మొట్ట మొదటి ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటి రాష్ట్ర వైస్ చైర్మన్ గా ఇందూరు కుర్వ బాలుకు నియామకం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం తాండూరు కురుమ సంఘం సభ్యులు కుర్వ బాలుకు సన్మానం నిర్వహించారు. తాండూరు పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు కుర్వ బాలుకు శాలువా కప్పి.. పూలమాల వేసే సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కురుమ సోదరులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటిలో రాష్ట్ర వైస్ చైర్మన్ గా కుర్వబాలు నియామకం కావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, సీనియర్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.