పర్యావరహిత గణనాథులను ప్రతిష్టించడం అభినందనీయం
– బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకచవితి ఉత్సవాలలో పర్యావరణ హితమైన గణనాథులను ప్రతిష్టించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సీతారంపేట్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ప్రతిష్టించిన మట్టి వినాయకునితో పాటు కాళీకాదేవి ఆలయంలో ప్రతిష్టించిన బుట్ట గణేష్‌లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి వినాయకులను ప్రతిష్టించిన నిర్వహకులను, బుట్ట గణేష్‌ను రూపొందించిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కడ్ మధులను అభినందించి సన్మానించారు. అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో దాదాపు 300 మంటపాలు ఉన్నాయని, ఇందులో కేవలం 10ల సంఖ్యలో మాత్రమె మట్టి వినాయకులను ఏర్పాటుచేయడం నిరాశ కలిగించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మట్టి వినాయకుల ఏర్పాటు చేసేవిదంగా చైతన్యం తేవాలని విజ్ఞప్తి చేశారు. తాండూరులో మట్టిగణేష్, బుట్ట గణేష్‌లాంటి పర్యావరణ హిత గణేషులను ప్రతిష్టించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, కోటం సిద్ధలింగం, రమేష్ టైలర్, సర్దార్ పటేల్ అసోషియేషన్ సభ్యులు హరి చల్లా, జుంటిపల్లి వెంకట్, రాము ముదిరాజ్, భాస్కర్, హరిప్రసాద్, రఘు, ఉదయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
