ఇందిరానగర్‌లో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు
– రాంమందిర్ గణేషున్ని దర్శించుకున్న ఎస్ఐ గిరి, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్‌లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం నాలుగో రోజు శ్రీ రామందిరంలో ప్రతిష్టించిన గణేషున్ని పట్టణ ఎస్ఐ గిరితో పాటు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్, నాయకులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అస్లాం, ఉర్దూ ఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, నాయకులు హరిహరగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
