ఐపీఎస్‌ అధికారికే మస్కా..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఐపీఎస్‌ అధికారికే మస్కా..!
– దోశ బిల్లు కట్టించే ప్రయత్నం
– వైరల్ అయిన సంఘటన
దర్శిని డెస్క్‌: ఉన్నత స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారికే ఓ కేటుకాటు మస్కా కొట్టించాడు. రెస్టారెంట్‌లో దోశ తిందామని వెళ్లిన అధికారికి చేదు అనుభవాన్ని మిగిల్చాడు. అధికారి తిన్న దోశకే కాకుండా దొంగ తిన్న దోశకు కూడా బిల్లు కట్టించేలా చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఐపీఎస్‌ అధికారి అరుణ్ బోత్రా తనకు ఎదురైన సంఘటనను స్వయంగా ట్వీట్ చేశారు. దోశ తినేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ దోశకు ఆర్డర్ ఇచ్చారు. ఆయన టిఫిన్ చేసిన తర్వాత వెయిటర్ బిల్లు ఇచ్చిన బిల్లును చూసి అధికారి షాక్ అయ్యారు. తాను తిన్నది ఒకే దోశ అయినప్పుడు రెండో దోశకు బిల్లు రావడం చూసి ఖంగుతిన్నాడు. ఇలా ఎందుకు జరిగిందని వెయిటర్‌ను అడగ్గా అతను అసలు విషయం బయటపెడ్డారు.

ఐపీఎస్ అధికారి రెస్టారెంట్‌కు వచ్చే ముందే ఓ మాయగాడు వెంట వచ్చి.. వెయిటర్‌తో తాను ఐపీఎస్ అధికారితో వచ్చినట్లు.. తనకు కూడ దోశ తీసుకరావాలని ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. తీరా బిల్లు వచ్చే సమయానికి ఆ కేటుగాడు అక్కడినుంచి మాయమయ్యాడు. ఇది విన్న ఆ అధికారి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఐపీఎస్ అధికారి తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ సోమవారం ఓ ట్వీట్ చేశారు. వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌ను దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. ఇందులో పలువురు ఐపీఎస్ అధికారికి మస్కా కొడుతున్న విషయం ఆ దొంగకు తెలుసా అంటూ మరికొందరు ప్రశ్నించారు. అలాగే మరికొందరు మిమ్మల్ని అడగకుండా ఆ వెయిటర్ అతడికి దోశ ఎందుకు ఇచ్చారంటూ అడిగారు. అధికారి చేసిన ట్విట్ కింద ఉంది.. చూడండి…