సంద‌డిగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి జ‌న్మ‌దినం

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

సంద‌డిగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి జ‌న్మ‌దినం
– అర్ద‌రాత్రి నుంచే శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ర‌వాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మగి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు సంద‌డిగా ప్రారంభ‌మ‌య్యాయి. బుధ‌వారం అర్ద‌రాత్రి దాటిన త‌రువాత నుంచే తాండూరు టీఆర్ఎస్ నేత‌లు హైద‌రాబాద్‌లోని మ‌హేంద‌ర్‌రెడ్డి నివాసంలో జ‌న్మ‌దిన సంబ‌రాల‌ను ప్రారంభించారు. తాండూరుకు చెందిన మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, టీఆర్ఎస్ యూత్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు రాకేష్ తాండ్ర‌, పెద్దేముల్ పీఎఏసీఎస్ చైర్మ‌న్ ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా నాయ‌కులు వెంక‌టేష్ చారి, పెద్దేముల్ మండ‌ల ఎంపీటీసీల ఫోరం అధ్య‌క్షులు ధ‌న్‌సింగ్ త‌దిత‌రులు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి చేత కేక్ క‌ట్ చేయించి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిని గ‌జ‌మాల‌తో స‌న్మానించారు.