విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి
– విద్యా వికాసం కేంద్రాల ద్వారా తోడ్పాటు
– సేవా భారతి అధ్యక్షులు రమేష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు సేవా భారతి కృషి చేస్తుందని సేవా భారతి అధ్యక్షులు రమేష్ అన్నారు.

ఆదివారం తాండూరు సేవా భారతి, నిష్ట ఫౌండేషన్ ఆధ్యర్యంలో అభ్యాసిక కేంద్రాల శిక్షకులకు నెలవారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సేవా భారతి అధ్యక్షులు రమేష్ తో పాటు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ, కోట్రిక విజయలక్ష్మీ, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అభ్యాసిక కేంద్రాల కోఆర్డీనేటర్ రాములులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సేవా భారతి అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో పేద విద్యార్థులకు విద్యను అందిచేందుకు విద్యా వికాసం అభ్యాసిక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు చదవుతో పాటు క్రమ శిక్షణ, ఆధ్యాత్మిక భావాలను నేర్పించడం జరుగుతుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలలో మెళకువలు నేర్పడంతో రానున్న రోజుల్లో ఒత్తిడి లేకుండా చదువులో ఉత్తమ ఫలితాలను సాధిస్తారని అన్నారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం సేవా భారతి కృషి చేస్తుందని అన్నారు.


