రైతుల కుటుంబానికి అండగా ఉంటాం
– ఎక్మాయిలో రైతు కుటుంబానికి 9వేల ఆర్థిక సహాయం
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: సహాకార సంఘంలో ఉన్న రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని బషీరాబాద్ మండలం నవాంద్గి సహాకార సంఘం చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎక్మాయి గ్రామానికి చెందిన మొగులయ్య అనే రైతు అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మృతి చెందిన రైతు అంత్యక్రియల నిమిత్తం రూ. 9వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం నవాంద్గి సహాకార సంఘం చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి ఈ ఆర్థిక సహాయాన్ని రైతు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాకార సంఘంలోని రైతులకు సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. రైతు మొగులయ్య మృతిపై విచారం వ్యక్తం చేశారు. సహాకార సంఘం నుంచి కూడ రావాల్సిన సౌకర్యాలు అందేలా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సర్పంచ్ నారాయణ, డైరెక్టర్లు గోపాల్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
