పక్కాగా నాకాబందీ
– నకిలీ విత్తనాలు, కల్తీ మద్యంపై విస్తృత తనిఖీలు
– పాత నేరస్తులు, అక్రమ రవాణాపై దృష్టి
– జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో ముమ్మర చర్యలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో పోలీసులు నాకాబందీని పకడ్బందీగా చేపట్టారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో ఒకే సమయానికి ఆకస్మాత్తుగా నాకాబందీ నిర్వహించారు. వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్లతో పాటు పోలీస్ స్టేషన్ల పరిధిలలో ముమ్మర తనిఖీలు జరిగాయి. నకిలీ విత్తనాలు, కల్తీ మద్యం, ఇతర రాష్ట్ర ల నుండి మద్యం అక్రమ రవాణాతో పాటు పాత నేరస్తులపైనా ప్రత్యేక నిఘా, జిల్లాలో చోరీ లను నివారించి, అక్రమ కార్యకలపాలపైనా ప్రత్యేక నిఘా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1515 వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. అందులో ద్వి చక్ర వాహనాలు 553, త్రిచక్ర వాహనాలు 153, నాలుగు చక్రాల వాహనాలు 588 మరియు ఇతర వాహనాలు 221 ఉన్నాయి. ఇందులో 15 వాహనాలు సిజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి జిల్లాలో నేరాలను నియంత్రించడంతో పాటు అక్రమ రవాణా ను అరికట్టడం, అక్రమ కార్యకలాపాలనను నియంత్రించడం ముఖ్య ఉద్దేశమన్నారు. నేరస్థుల కదలిక పైన దృష్టిసారించేందుకు నాకాబందీ దోహదపడుతుందన్నారు. నాకాబందీల ద్వారా సాదారణ ప్రజలను ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నారు. నేరస్థులు, అక్రమ రవాణాలను అరికట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇకపై కూడా జిల్లాలో అకస్మాత్తుగా నాకాబందీ లు మరియు కార్డెన్ సెర్చ్‌లు జరుగుతాయన్నారు. కావున జిల్లా ప్రజలు ఎల్లపుడూ తమ గుర్తింపు కార్డులు, వాహన పత్రాలను మొదలగునవి అన్నీ దగ్గర ఉంచుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి…
సూపర్ పోలీస్..!
– నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ
– చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు
– డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు
https://dharshininews.com/17404


