రాయితో కొట్టి.. చంపుతామని బెదిరింపు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రాయితో కొట్టి.. చంపుతామని బెదిరింపు
– వీఆర్ఏ దాడిలో ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్‌పై కేసు
– వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాయితో కొట్టి.. చంపుతామని బెధిరించినట్లు వీఆర్ఏ ఇచ్చిన ఫిర్యాదుతో ఇసుక ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధి పరిధి పాత తాండూరు మీదుగా జోరుగా ఇసుక ట్రాక్టర్లలో అదే ప్రాంతానికి చెందిన అబ్రాహర్‌ లాలకు చెందిన ట్రాక్టర్‌ను స్థానికంగా వీఆర్ఏగా పనిచేస్తున్న ఎల్లప్పపై అడ్డుకున్నారు. ట్రాక్టర్‌ను నెమ్మదిగా తీసుకెళ్లాలనని డ్రైవర్‌ ఫిరోజ్‌తో సూచించారు. దీంతో డ్రైవర్ ఫిరోజ్ ఓనర్ అబ్రాహర్ లాలకు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అబ్రాహర్ లాల ఎల్లప్పపై రాయితో దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా ఎల్లప్పను మళ్లీ ట్రాక్టర్ ఆపితా చంపుతానని బెదిరించాడు. గాయాల పాలైన బాధితుడు వీఆర్ఏ ఎల్లప్ప పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ట్రాక్టర్ ఓనర్ అబ్రాహర్ లాల, డ్రైవర్ ఫిరోజ్‌లపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage