శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన కమీషనర్ నాగరాజు
– కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: గుండెపోటుతో మరణించిన తాండూరు మున్సిపల్ జవాన్ శ్రీను కుటుంబాన్ని ఆత్మకూరు మున్సిపల్ కమీష నర్ నాగరాజు పరామర్శించారు. మున్సిపల్ లో జవాన్ గా పనిచేసిన శ్రీనివాస్ గత నెల 18న గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఆత్మకూరు కమీషనర్ నాగరాజు తాండూరు మండలం గౌతాపూర్ లోని శ్రీనివాస్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. శ్రీను మరణం పట్ల సానుభూతి ప్రకటించారు. శ్రీను భార్య బాలమణికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. అందరు మనోధైర్యంతో ఉండాలని, అపద సమయంలో తమ వంతు సహాకారం అందిస్తామని భరోసా అందించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది, కార్మికులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…


